రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ

హైదరాబాద్ (CLiC2NEWS): కెసిఆర్ సర్కార్ రాష్ట్రంలో నూతన రేషన్ కార్డుల జారీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ రేపటి (జులై 26 సోమవారం) నుంచి మొదలవుతుంది. జయశంకర్ భూపాలపల్లిలో అధికారికంగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అందజేయనున్నారు. అధికారులు దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అందిన దరఖాస్తుల పరిశీలన పూర్తిచేసి 3,04,253 కుటుంబాలు కొత్తగా రేషన్‌కార్డుకు అర్హమైనవిగా యంత్రాంగం గుర్తించింది. మొత్తం 4,15,901 కుటుంబాలు కొత్తకార్డులకు ఆన్లైన్లో అర్జీ పెట్టుకున్నారు. వడపోత తరువాత 3,91,112 దరఖాస్తులను పరిశీలనకు తీసుకున్నారు.