ఆగస్టు 9న‌ లక్ష మందితో దళిత గిరిజ‌న దండోరా: రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ జెండా చివరి దాకా మోసినవాళ్లే నాకు బంధువు..

సికింద్రాబాద్‌ (CLiC2NEWS): కెసిఆర్ స‌ర్కార్‌పై పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ మరోసారి నిప్పులు చెరిగారు. చివరి దాకా కాంగ్రెస్ జెండా మోసిన వాళ్లే తన బంధువు అని.. కష్టపడ్డ వాడే తనకు బంధువు అని ఆయ‌న పేర్కొన్నారు. మరో 20 నెలలు కాంగ్రెస్‌ పార్టీ కష్టపడి పని చేయాలని కోరారు. అధికారం లోకి వచ్చిన తర్వాత కష్టపడి పని చేసిన కార్యకర్తల కే పదవులు అని పేర్కొన్నారు.

మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగ‌ర్‌రావును సికింద్రాబాద్‌లోని ఆయ‌న నివాసంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా రేవంత్ క‌లివారు. చిరాన్ పోర్ట్ క్ల‌బ్‌లో ఆనంత‌రం ఏర్పాటు చేసిన మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ స‌మావేశానికి రేవంత్ చీఫ్ గెస్టుగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మాజీ ఎంఎల్‌సి శ్రీ ప్రేమ్‌సాగర్ రావు, మంచిర్యాల డిసిసి ప్రెసిడెంట్ కొక్కిరల సురేఖా రేవంత్‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. త‌న‌కు ప్రేమ్‌సాగ‌ర్ రావుకు మ‌ధ్య‌న ఎలాంటి విబేధాలు లేవ‌ని అన్నారు. ఆయ‌న నాకు సోద‌ర స‌మానుల‌ని పేర్కొన్నారు.

సికింద్రాబాద్‌లోని చిరాన్ పోర్ట్ క్ల‌బ్‌లో ఆదివారం నిర్వ‌హించిన మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ స‌మావేశంలో మాట్లాడుతున్న‌ రేవంత్ రెడ్డి, ప్రేమ్‌సాగ‌ర్ రావు

 

ఇంద్ర‌వెల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ బ‌లోపేతం కోసం క‌దం తొక్క‌నున్న‌ట్లు రేవంత్ ప్ర‌క‌టించారు. ఉప ఎన్నికలు ఎక్కడ ఉంటే అక్కడ పథకాలు అమలు చేస్తారాని అయ‌న స‌ర్కార్ ను నిల‌దీశారు. రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల దళితులకు న్యాయం చేస్తారా? లేదా? అని స‌ర్కార్‌ను నిలదీశారు. ఓట్లు అడుక్కునేది ఉంటే తప్పా రాష్ట్రంలో పథకాలు కొత్తవి రావని ఎద్దేవ చేశారు.

ఆగస్ట్ 9 నుండి సెప్టెంబర్ 17 వరకు దళిత దండోరా మోగిస్తామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఇంద్రవెల్లి నుండి లక్ష మందితో దళిత దండోరా మోగిస్తామని రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

 

సికింద్రాబాద్‌లోని చిరాన్ పోర్ట్ క్ల‌బ్‌లో ఆదివారం నిర్వ‌హించిన మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ స‌మావేశానికి హాజ‌రైన కాంగ్రెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు

 

మంచిర్యాల జిల్లా పార్టీ స‌మావేశానికి హాజ‌రైన పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి,
ప్రేమ్‌సాగ‌ర్ రావుతో కాంగ్రెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు

 

Leave A Reply

Your email address will not be published.