TS: కారుపైకి దూసుకెళ్లిన మరో కారు: ముగ్గురి మృతి

వికారాబాద్ (CLiC2NEWS): జిల్లాలోని పూడూరు మండలంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని మన్నెగూడ కాటన్ మిల్లు వద్ద ఓ కారు ఎదురుగా వస్తున్న మరో కారుపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను మల్లికార్జున్‌రెడ్డి, రాజ్యలక్ష్మి, దేవన్ష్ రెడ్డిగా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.