Olympics: ఆట బంగారం.. కాంస్యమూ దక్కలేదు

మహిళా హాకీ జట్టు ఓటమి..

టోక్యో (CLiC2NEWS): డిఫెండింగ్ ఛాంపియ‌న్ బ్రిట‌న్‌తో ఫ్లేఆఫ్ పోరులో భార‌త్ దాదాపుగా గెలిచినంత ప‌నిచేసింది. ఒలింపిక్స్‌లో భారత మహిళల జట్టు ఆఖ‌రి వ‌ర‌కు పోరాడింది. ఒకానొక ద‌శ‌లో ప్ర‌త్య‌ర్థిని హ‌డ‌లెత్తించింది. వారికి ఓట‌మి భ‌యం పుట్టించింది. కాంస్యం కోసం బ్రిటన్‌తో జరిగిన పోరులో రాణిరాంపాల్‌ సేన 3-4 తేడాతో ఓడింది.

మ్యాచ్ ఆసాంతం అద్భుత ప్రదర్శన చేసిన భారత అమ్మాయిలు.. కాంస్యం కోసం తీవ్రంగా శ్రమించారు. తొలి అర్ధభాగంలో 3-2 తేడాతో భారత్ ఆధిక్యంలో నిలవగా.. మూడో క్వార్టర్‌లో బ్రిటన్ మరో గోల్ చేసి స్కోరు సమం చేసింది. ఆ తర్వాత నాలుగో క్వార్టర్‌ ఆరంభంలో మరో గోల్ చేసి 4-3 బ్రిటన్ ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం స్కోరు సమం చేసేందుకు భారత్ అమ్మాయిలు తీవ్రంగా శ్రమించినా అదృష్టం కలిసి రాలేదు.

అనుకున్న‌ట్టుగానే బ్రిట‌న్ దూకుడుగా మ్యాచ్‌ను ఆరంభించింది. తొలి క్వార్ట‌ర్ మొత్తం బంతిని త‌మ ఆధీనంలో ఉంచుకంది. గోల్ కీప‌ర్ స‌విత మ‌త్రం మూడు సార్లు బ్రిట‌న్ గోల్స్‌ను అడ్డుకుంది. రెండో నిమిషంలో పిసీ, 12వ నిమిషంలో రెండు ఫీల్డ్ గోల్స్ నుంచి కాపాడింది.

Leave A Reply

Your email address will not be published.