ఇకపై మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న

రాజీవ్ ఖేల్ ర‌త్న పేరు మార్పు.. ప్ర‌ధాన‌మంత్రి ట్వీట్‌

న్యూఢిల్లీ (CLiC2NEWS): భార‌త్‌లో క్రీడాకారుల‌కు ఇచ్చే అత్యుత్త‌మ పురస్కారం రాజీవ్ ఖేల్ ర‌త్న.  ఈ పేరు మోడీ స‌ర్కార్ మార్చింది. ఈ మేర‌కు ప్ర‌ధాన మంత్రి  న‌రేంద్ర మోడీ ట్విట్ట‌ర్‌లో పోస్టు పెట్టారు. రాజీవ్ ఖేల్‌ర‌త్న పేరును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారంగా మార్పు చేసిన‌ట్లు ప్ర‌ధాని ప్ర‌క‌టించారు.

“ఖేల్ రత్న అవార్డుకు మేజర్ ధ్యాన్ చంద్ పేరు పెట్టాలని ప్ర‌జ‌లు విజ్ఞ‌ప్తులు చేశారు. భారతదేశవ్యాప్తంగా పౌరుల నుండి అనేక అభ్యర్ధనలు అందుకుంటున్నాను. వారి అభిప్రాయాలకు నేను వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

వారి మనోభావాలను గౌరవిస్తూ, ఖేల్ రత్న అవార్డును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అని పిలుస్తారు!“

అని మోడీ ట్విట్ట‌ర్‌లో పోస్టు పెట్టారు.

కాగా భార‌త దేశంలో ఈ అత్యుత్త‌మ పుర‌స్కారానికి మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ జ్ఞాప‌కార్థం 1991-92లో ప్రారంభించారు. అప్ప‌టి నుండి దీనిని రాజీవ్ ఖేల్‌ర‌త్న అవార్డుగా ప‌రిగ‌ణిస్తున్నారు.

కాగా మేజర్ ధ్యాన్ చంద్ జ‌ట్టు మూడుసార్లు ఒలింపిక్స్‌లో స్వ‌ర్ణ ప‌త‌కాల‌ను సొంతం చేసుకుంది. మేజర్ ధ్యాన్ చంద్ హాకీ మాంత్రికుడిగా పేరుగాంచారు.

Leave A Reply

Your email address will not be published.