సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం, ఐదుగురు దుర్మరణం

జోగిపేట (CLiC2NEWS): సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఎదురెదురుగా ఢీ కొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా రంగంపేట గ్రామానికి చెందిన పద్మ(30), అంబదాస్ (40) దంపతుల కుమారుడు వివేక్ (6) అనారోగ్యానికి గురి కావడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. చికిత్స అనంతరం స్వగ్రామానికి తిరిగి వస్తుండగా చౌటకూర్ వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీ కొట్టింది. దాంతో ఈ ఘటనలో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు.
విషయం తెలుసుకున్న పుల్కల్ ఎస్సై నాగలక్ష్మి సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.