AP: 10వ త‌ర‌గ‌తి ఫలితాలు విడుదల

సబ్జెక్టులు, ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు..

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌ద‌వ త‌ర‌గ‌తి ఫ‌లితాల‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ విడుదల చేశారు. ఈ ఫ‌లితాల‌ను విజ‌య‌వాడ‌లో శుక్ర‌వారం సాయంత్రం మంత్రి విడుద‌ల చేశారు.

www.bse.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని పరీక్షల నిర్వహణ డైరెక్టర్ తెలిపారు. 2020 మార్చి, 2021 జూన్‌కు సంబంధించి సబ్జెక్టుల వారీగా.. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు ఇచ్చామన్నారు.

విడుద‌ల సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఫార్మేటివ్, సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ ఆధారంగా గ్రేడ్లుఫార్మేటివ్, సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ ఆధారంగా గ్రేడ్లు విభజన చేసినట్లు మంత్రి సురేశ్ వెల్లడించారు. గ్రేడ్ల వల్ల 6.26 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగిందన్నారు. ఎఫ్‌ఏకు 50 శాతం, ఎస్‌ఏకు 50 శాతం కేటాయించి గ్రేడ్లు విభజన చేశామన్నారు. గ్రేడ్ల కేటాయింపు వల్ల ఏ విద్యార్థికీ నష్టం జరగదన్నారు.ప్రతిభావంతులకు నష్టంకరోనా వల్ల రెండో ఏడాది కూడా పరీక్షలు నిర్వహించలేకపోయామని మంత్రి సురేశ్ అన్నారు. 2020 మార్చి, 2021 జూన్ వ‌ర‌కు సంబంధించి విద్యార్థుల‌కు స‌బ్జెక్టుల వారీగా ప్ర‌తిభ ఆదారంగా గ్రేడ్లు విడుద‌ల చేశారు. గ్రేడ్ల కేటాయింపు వల్ల ఏ విద్యార్థికీ నష్టం వాటిల్ల‌ద‌న్నారు. క‌రోనా వ‌ల్ల రెండో ఏడాది కూడా ప‌రీక్ష‌లు నిర్వ‌హించలేక‌పోయామ‌ని మంత్రి వివ‌రించారు.

Leave A Reply

Your email address will not be published.