ఘనంగా జక్కంపూడి జయంతి

మండపేట (CLiC2NEWS): వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రీ పాపారాయుడు ఆధ్వర్యంలో జక్కంపూడి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దివంగత జక్కంపూడి జయంతి సందర్భంగా మండపేట కామత్ ఆర్కేడ్ లో జక్కంపూడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పాపారాయుడు మాట్లాడుతూ జక్కంపూడి రామ్మోహనరావు రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నితంగా ఉండేవారని రాష్ట్రానికి ఎనలేని సేవలు చేశారని ఆయన కొనియాడారు. పేద బడుగు బలహీన వర్గాలకు ఆయన ఎప్పుడూ అండగా నిలిచేవారని అన్నారు. రాజశేఖరరెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీని జిల్లాలో ఒంటి చేత్తో గెలిపించిన మహానాయకుడు రామ్మోహనరావు అన్నారు. అనంతరం గవర్నమెంట్ హాస్పటల్ లో రోగులకు పండ్లు రొట్టెలు పంచారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పోతంశెట్టి ప్రసాద్ , ముక్కా సుబ్రహ్మణ్యం, మందపల్లి రవికుమార్, శెట్టి నాగేశ్వరరావు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ మీగడ శ్రీనివాస్, ఏడిద గ్రామ సర్పంచ్ బూరిగ ఆశీర్వాదం, పార్టీ మండల కన్వీనర్ పిల్లా వీరబాబు, సాధనాల శివ భగవాన్ , పలివెల సుధాకర్, కురుపూడి రాంబాబు, అధికారి శ్రీనివాస్ , బూరిగ జానీ, లక్ష్మి, పొలమాల సత్తిబాబు, పువ్వల సుధాకర్ తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.