మున్సిప‌ల్ కార్యాల‌యం వ‌ద్ద ఉపాధ్యాయ సంఘాల ధ‌ర్నా..

 మండపేట (CLiC2NEWS): మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ సంఘాలు ధర్నా నిర్వహించారు. ఏపీ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఆందోళన చేపట్టారు.  మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ కొవ్వూరి గోపాలకృష్ణారెడ్డి అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ కు వినతి పత్రం అందజేసి మున్సిపల్ ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఐ. వెంకటేశ్వరరావు శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. ఆర్థికేతర సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించకుండా ఉందని, అలాంటి సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని విద్యాశాఖలో వస్తున్న వింత పోకడలు మానుకోవాలని నూతన విద్యా విధానాన్ని సమీక్షించాలని అన్నారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలని అన్నారు.  విద్యార్థుల సంఖ్యను బట్టి కొత్త ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలన్నారు.  మున్సిపల్ ఉపాధ్యాయులకు నెలవారీ ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామేశ్వర రావు మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న అక్రమ బదిలీలు వెనక్కి తీసుకోవాలని అన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి  జ్యోతిబసు మాట్లాడుతూ మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని పీఎఫ్ ప్రకటించాలని సీపీఎస్ రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరసా రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు మున్సిపల్ ప్రధానోపాధ్యాయులకు డి డి ఓ పవర్స్ కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి సురేంద్ర కుమార్, సిఐటియు జిల్లా నాయకురాలు కృష్ణవేణి, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర బాద్యులు డాక్టర్ చల్లా రవి కుమార్ లు మద్ధతు తెలిపారు. కార్యక్రమంలో మండపేట పట్టణ అధ్యక్షులు కే సూర్యప్రకాశరావు, ప్రధాన కార్యదర్శి కే సత్తిబాబు, ఎం శ్రీనివాస్ గౌరవ అధ్యక్షులు సీహెచ్ వీవీ సత్యనారాయణమూర్తి, సహ అధ్యక్షులు రామచంద్రారెడ్డి, మహిళా అధ్యక్షురాలు వి లక్ష్మి ,జిల్లా కౌన్సిలర్ కె అనసూయ, మండపేట మండల అధ్యక్షులు త్రినాధ్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, గండి స్వామి ప్రసాద్, 100 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.