India Corona: కొత్తగా 38 వేల కేసులు, 40 వేల రికవరీలు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా కేసులు కొద్దిగా తగ్గాయి. శుక్రవారం 44 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా 38 వేలకు పడిపోయాయి. నిన్నటికంటే ఇది 13 శాతం తగ్గాయి. దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 38,628 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం కరోనా బులిటెన్ విడుదల చేసింది.
- తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,18,95,385కు చేరింది.
- కొత్తగా దేశంలో 617 మంది మృతిచెందారని ఆరోగ్యశాఖ ప్రకటించింది. కాగా ఇప్పటి వరకు కరోనాతో మొత్తం మరో 4,27,371 మంది మహమ్మారి వల్ల మరణించారు.
- గడిచిన 24 గంటల వ్యవధిలో 40,017 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో 3,10,55,861 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు.
- ప్రస్తుతం 4,12,153 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
- దేశంలో ఇప్పటి వరకు మొత్తం 50,10,09,609 డోసులు పంపిణీ చేశారు.