100 కిలోల బంగారంతో గోవిందుడి గోపురానికి తాపడం

తిరుమల (CLiC2NEWS): తిరుమలలో ఉన్న గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారం తాపడం చేయించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయత్నాలు చేస్తోంది. ఏకంగా 100 కిలోల బంగారంతో తాపడం చేయించనున్నారు. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. హనుమంతుడి జన్మభూమిని అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా వెల్లడించింది. హనుమంతుడి విగ్రహం, జన్మ వృత్తాంతం తెలిపే చిత్రాలు ఏర్పాటు చేస్తామని, తరిగొండ వెంగమాంబ సమాధి స్థలాన్ని బృందావనంగా అభివృద్ధి చేస్తామని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.