India Corona: 39,070 కొత్త కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా కేసులు మ‌ళ్లీ స్వల్పంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా గ‌డిచిన 24 గంటల్లో కొత్తగా 39,070 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది.

  • తాజా కేసుల‌తో క‌లిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,19,34,455కు చేరింది.
  • తాజాగా దేశంలో 43,910 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 3,10,99,771 మంది బాధితులు కోలుకున్నారు.
  • గ‌డిచిని 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్తగా 491 మంది మృతిచెందారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం 4,27,862 మంది వైరస్‌ వల్ల మ‌ర‌ణించారు.
  • ప్ర‌స్తుతం 4,06,822 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
  • దేశంలో 50,68,10,492 కరోనా డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ‌ తెలిపింది.
  • గత 24 గంటల్లో 55,91,657 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామని వెల్లడించింది.
Leave A Reply

Your email address will not be published.