Mancherial: మంచిర్యాలలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

మంచిర్యాల (CLiC2NEWS): జిల్లా కేంద్రంలో ఆదివారం విశ్వహిందూ పరిషత్ ఆవిర్భావ దినోత్సవం, శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విభాగ్ కార్యదర్శి వేపూరి రాములు గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన యువతకి మార్గ నిర్దేశనం చేశారు. ఈ కార్యక్రమంలో 60 మంది యువతీ యువకులు విశ్వ హిందు పరిషత్ లో చేరారు. ఈ కార్యక్రమంలో పలువురికి కొత్త భాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందు పరిషత్ జిల్లా సహ కార్యదర్శి బోయినీ రవికుమార్, భజరంగ్ దళ్ జిల్లా సమ్యోజక్ చెరుకు శశి కిరణ్, పట్టణ నగర సహా కార్యదర్శి దాసరి కిరణ్, పెద్ద ఎత్తున మహిళలు, యువతి యువకులు, భక్తులతోపాటు విశ్వ హిందు పరిషత్ కార్యకర్తలు పాల్గొన్నారు.