SRSP 24 గేట్లు ఎత్తి 99 వేల క్యూసెక్కుల నీటి విడుదల
నిజామాబాద్ (CLiC2NEWS): మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ఎస్సారెస్పీకి భారీ వరద వస్తోంది. దాంతో ప్రాజెక్టు అధికారులు 24 గేట్లను ఎత్తి మిగులు జలాలను గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు 17 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. మంగళవారం ఉదయం నుంచి ఇన్ఫ్లో భారీగా పెరుగుతూ వచ్చింది. సాయంత్రానికల్లా 86 వేల 530 క్యూసెక్కులకు చేరింది. దీంతో అధికారులు క్రమంగా 24 గేట్లను ఎత్తి దిగువకు 99 వేల 880 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీ ఇన్ఫ్లో కొనసాగుతుందని ప్రాజెక్టు ఎస్ఈ శ్రీనివాస్ తెలిపారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు, 90.313 టీఎంసీలు
మంగళవారం సాయంత్రానికి పూర్తిస్థాయి నీటి మట్టంతో ఉంది.