సగ్గుబియ్యం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా ?

సగ్గుబియ్యం.. హిందీలో సాగోదాన, తెలుగులో సగ్గుబియ్యం, అంటారు. సగ్గుబియ్యంను పాయసంలో వాడుతారు. సగ్గుబియ్యం తేలికగా జిర్ణం అవుతుంది. సగ్గుబియ్యం జావను జ్వరం రోగులకు ఇస్తుంటారు. ఇది రుచిగా వుండి తేలికగా జిర్ణం అవుతుంది. మృదువుగా ఉంటాయి. పొట్టకు బాలన్ని కలిగిస్థాయి. సగ్గుబియ్యం నందు, ప్రోటీన్స్, corbohydrates, కొవ్వు, కాల్షియమ్, iron, పాస్పోరస్, నికోటిన్ ఆసిడ్, విటమిన్ b1, నియాసిన్, కెలరీలు, ఉన్నాయి.
సగ్గుబియ్యం బలమైన ఆహారం, మంచి శక్తినిస్తాయి, రోగికి తొందరగా కోలుకొనుటకు సహకరిస్తాయి. మూత్రం సాఫీగా వచ్చేటట్లు చేస్తాయి. సగ్గుబియ్యం దీర్ఘ కాలం రోగము నుండి భాదపడేవారికి, కామెర్ల రోగులకు, అజిర్తి రోగులకు, అతిసారం, జిగురు విరోచనాలు, క్షయ రోగులకు, మంచిది, ఎదుగుతున్న పిల్లలకు, సగ్గుబియ్యం జావ యందు తేనె వేసి ఇచ్చిన ఎదుగుదల బాగుంటుంది.
సగ్గుబియ్యం పాలలో కాచి అందులో కిస్ మిస్, జీడిపప్పు, యాలుకలు, మరియు పంచదార కలిపి తయారుచేసుకొని తాగే పాయసం బాలన్నీస్తుంది. శుక్రాన్ని వృద్ధి చేస్తుంది. సంతృప్తి కలిగిస్తుంది.
–షేక్.బహర్ అలీ
యోగచార్యుడు