హైదరాబాద్ కు భారీ వర్ష సూచన: వాతావరణశాఖ హెచ్చరిక
హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్.. 8 గంటల పాటు భారీ వర్షం..!

హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్ నగరానికి భారీ వర్ష సూచన. నగరంలో మరోసారి భారీవర్షం పడనుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మరో గంటలో భారీవ వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు.
అలాగే ఉదయం నుంచి కురుస్తున్న సాధారణ వర్షం మరో 8 గంటల పాటు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రజలు ఇండ్లలోనే ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. సహాయం కోసం 040 – 2955 5500 నంబర్‌ను సంప్రదించాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.
రాష్ట్రంలో రుతుపవనాలు… దట్టంగా అలుముకున్న క్యూములో నింబస్ మేఘాలు చురుగ్గా కదులుతున్నాయి. అలాగే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది అని తెలిపారు. కాబట్టి ఆ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అందుకే గ్రేటర్ హైదరాబాద్ తో పాటుగా 16 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అయితే ప్రస్తుతం మూసీ పరీవాహక ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది.