TS: మార్చి 23 నుంచి ఇంటర్‌ పరీక్షలు

ఇంట‌ర్ విద్యాసంవ‌త్స‌రం ఖ‌రారు.. ప‌రీక్ష‌ల విధానంలో కీల‌క మార్పులు..

హైదరాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణలో ఇంటర్మీడియట్‌ 2021-22 విద్యా సంవత్సరాన్ని సోమవారం రాష్ట్ర స‌ర్కార్ ఖ‌రారు చేసింది. ఈ సారి పరీక్షల విధానంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల‌తో క‌లిపి 220 ప‌ని దినాల‌తో విద్యా సంవ‌త్స‌రాన్ని ఖ‌రారు చేసింది. ద‌స‌రాకు ఆదివారంతో క‌లిపి 5 రోజులు, సంక్రాంతికి జ‌న‌వ‌రి 13 నుంచి 15 వ‌ర‌కు సెల‌వులు ప్ర‌క‌టించింది. అలాగే అర్ధ సంవత్సరం, ప్రీ ఫైనల్‌ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.

  • డిసెంబర్‌ 13 నుంచి 18వ తేదీ వరకు అర్ధ సంవత్సర పరీక్షలు
  • ఫిబ్ర‌వ‌రి 10 నుంచి 18 వ‌ర‌కు ఫ్రి ఫైన‌ల్ ప‌రీక్ష‌లు
  • ఫిబ్రవరి 10 నుంచి 18 వరకు ప్రీ ఫైనల్‌ పరీక్షలు
  • ఫిబ్ర‌వ‌రి 23వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ వరకు ప్రాక్టికల్స్‌
  • మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 15 వరకు ఇంటర్‌ వార్షిక పరీక్షలు
  • అలాగే మే చివరి వారంలో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు
  • ఏప్రిల్‌ 14 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు
  • జూన్‌ 1న కాలేజీలు పునః ప్రారంభం
  • ఈ మేరకు సోమవారం అకాడమిక్‌ క్యాలెండర్‌ను ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ విడుదల చేశారు.
Leave A Reply

Your email address will not be published.