IND Vs ENG: నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం

లండన్ (CLiC2NEWS): ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌పై 157 పరుగుల తేడాతో టీమ్ఇండియా ఘనవిజయం సాధించింది. చివరి రోజు ఆతిథ్య జట్టు పది వికెట్లు తీసి సరీస్ సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ నిర్ధేశించిన 368 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆథిథ్య జట్టు 210 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-1తో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది.
ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లలో ఓపెనర్లు ఇద్దరు (హసీబ్ హబీద్ 63, రోరీ బర్న్స్ 50) అర్ధశతకాలు చేసి జట్టుకు విజయం వైపుకు తీసుకెళ్తుండగా శార్దుల్ మొదటి వికెట్ ను భారత్ కు అందించాడు. అనంతరం రెండో సెషన్ లో బుమ్రా, జడేజా బౌలింగ్ ధాటికి ఇంగ్లాండ్ ఆటగాళ్లు పెవిలియన్ దారి పట్టారు. అయితే చివరి సెషన్ లో భారత్ కు రెండు వికెట్లు అవసరం ఉండగా ఉమేష్ యాదవ్ వారిని ఔట్ చేయడంతో ఇంగ్లాండ్ 210 పరుగులకే కుప్పకూలింది. దాంతో భారత్ 157 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 5 టెస్టుల సిరీస్ లో భారత్ 2-1 తో ఆధిక్యంలోకి వెళ్ళింది.
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 191 పరుగులకు ఆలౌట్‌కాగా.. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులు చేసింది. రోహిత్ శర్మ శతకంతో సత్తా చాటడం వల్ల రెండో ఇన్నింగ్స్‌లో 466 పరుగులు చేసిన భారత జట్టు ప్రత్యర్థికి 368 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
Wow, fantastic blog layout! How long have you been running a blog for? you make blogging look easy. The full glance of your web site is fantastic, as smartly as the content!!