ఆ జిల్లాలో రికార్డు స్థాయిలో వ‌ర్షాలు.. రెడ్ అల‌ర్ట్!

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ‌, రేపు (మంగ‌ళ‌-బుధ‌వారాలు) భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. మంగ‌ళ‌వారం ఐదు జిల్లాల‌కు, బుధ‌వారం నాలుగు జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్ హెచ్చ‌రికలు జారీ చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంతోపాటు ఉపరితల ద్రోణిగా మారడంతో.. రాష్ట్రమంతటా హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా ప‌లు జిల్లాల్లో మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

  • మంగ‌ళ‌వారం:
    పెద్ద‌ప‌ల్లి, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, ములుగు, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, ఖ‌మ్మం
  • బుధ‌వారం:
    ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మ‌ల్, నిజామాబాద్

ఈ జిల్లాల్లో అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది.

రాష్ట్రంలోని మిగ‌తా జిల్లాల్లో ఈ రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.