AP: అథ్లెటిక్స్‌లో బాలబాలికలకు ఉచిత శిక్షణ

అమరావతి (CLiC2NEWS) : రాష్ట్రంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ సెంటర్, స్టేట్ లెవల్ ఖేలో ఇండియా సెంటర్ (ఏఎస్ఆర్ స్టేడియం–ఏలూరు) అథ్లెటిక్స్‌లోని వివిధ విభాగాల్లో అండర్ 14,16,18 కేటగిరీల్లో బాలబాలికలను ఎంపిక చేసి వారికి ఉచితంగా శిక్షణ అందించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 13,14 తేదీల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎంపిక పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీల్లో అర్హత సాధించిన క్రీడాకారులకు అథ్లెటిక్స్ లోని వివిధ విభాగాల్లో శిక్షణ అందిస్తారు. స్పోర్ట్స్ హాస్టల్లో వీరికి ఉచిత భోజన వసతుల కల్పించనున్నారు. ఆసక్తి గల క్రీడాకారులు వివరాలకోసం 98853 12356 నంబరును సంప్రదించగలరని ప్రకటనలో పేర్కొన్నారు.