జీపును వెనుక నుంచి ఢీకొన్న సిమెంట్ లారీ: 8 మంది మృతి
బెంగళూరు (CLiC2NEWS): కర్ణాటకలో ప్రయాణికులతో వెళ్తున్న జీపును వెనక నుంచి వచ్చిన సిమెంటు లారీ ఢీకొట్టింది. ఈ సంఘటన చికబల్లాపూర్ జిల్లాలోని చింతామణి తాలూకా మరినాయకనహళ్లి దగ్గర జరిగింది. ఈ ప్రమాదంలో జీపులోని 8 మంది ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న కంచర్లహళ్లి పోలీసులుక్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయాలపాలైన వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Wow, fantastic weblog structure! How lengthy have you ever been running a blog for? you make running a blog look easy. The whole glance of your site is magnificent, let alone the content!!