విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-15)

15
ఎవరి మనస్సులో ఏమున్నప్పటికీ విజయ్, విరంచి లు తమ అభిప్రాయాలను బహిరంగ పర్చుకున్నట్లుగా లేదు. పరస్పర ఆకర్షణ అది. స్నేహపూర్వకంగా నవ్వుకున్నారు. ఈ లోగా గ్లాసులతో పాటు తనకు కావాల్సిన డ్రిక్స్‌ను కుటుంబరావు సోఫా ముందున్న టీపాయిపై పెట్టారు. కూల్‌డ్రిక్స్‌ను నేను సర్వ్ చేస్తానని విరంచి లేచి రెండు గ్లాసుల్లో తీసుకువచ్చి ఒకటి విజయ్‌కు ఇచ్చి, తాను కూడా కూల్ డ్రింక్స్ పట్టుకొని అక్కడే కూర్చుంది.

విజయ్ గారు మీరు మంత్రి ఎప్పుడు అవుతున్నారు. మీకు మంత్రివర్గలో త్వరలో చోటు లభిస్తుందని అంతా అంటున్నారు.. డ్రిక్స్ సిఫ్ చేస్తూ కుటుంబరావు అన్నారు.

లేదండీ, మంత్రిగా కంటే శాసనభ్యునిగానే నాకు స్వేచ్ఛ ఎక్కువగా ఉంది. ఏ అంశంపైనా అయినా వివరాలు తీసకునే వీలుంది. సీనియర్ ఐఎఎస్ అధికారులందరూ నేనంటే అభిమానిస్తున్నారు. దీంతో అసెంబ్లీలో బాగా మాట్లాడగలుగుతున్నాను. మంత్రిగా ఉంటే ప్రభుత్వ కార్యక్రమాలను వ్యతిరేకించరాదు. ఆ ఒక్క శాఖకే నేను పరిమితం కావాల్సి ఉంటుంది. ప్రభుత్వంలో లోటుపాట్లు జరిగుతున్నట్లు తెలిసినా పెదవి విప్పడానికి ఉండదు.. అయినా ఫస్టు టైం ఎంఎల్‌ఎలకు నో మంత్రి పదవి అని ముందుగానే ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకున్నారు. దీంతో పోటీ తగ్గిపోయి అసంతృప్తి కూడా కనీస స్థాయిలోనే ఉంది. నాకు ఒక్కనికే మంత్రి పదవి ఇస్తే ముఖ్యమంత్రికే కష్టం, అందరూ పోటీపడుతారు. ఆ రకంగా ఆయనకు మంచిది.. నాకూ మంచిదే కదా అంటూ చెబుతున్న విజయ్ వైపు ఎంతో ఆసక్తిగా చూస్తున్నది విరంచి.

ఎన్ని అయినా చెప్పండి.. మంత్రి అంటేనే ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటే ఇంకా ఎక్కువ పనులు చేసే వీలుంటుంది. చాల మందికి సహాయం చేయవచ్చు. మంత్రిమండలి సమావేశాల్లో చర్చించి ఏకాభిప్రాయం తీసుకువచ్చి, మీరు అనుకున్న విధంగా ప్రభుత్వం మంచి మార్గలో నడిపించేలా ప్రయత్నించ వచ్చు. మీ సిద్దాంతాల నుంచి వెనుకంజ వేయాల్సిన పనిలేదు. సిఎం ప్రతిపాదిస్తే వద్దనకండి విజయ్ గారు అన్నారు కుటుంబరావు.

లేదులెండి.. ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు నన్ను క్యాబినెట్‌లోకి వస్తావా అని అడిగారు. నేనే వద్దని, ఇతరుల నుంచి మీకు అసంతృప్తి పెరుగుతుందని చెప్పాను. చూద్దాం మళ్లీ మా పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు చూద్దాం. నా అనుభవం ఎలా ఉన్నా ముఖ్యమంత్రి గారికి నేనంటే అధిక అభిమానం . ఎలాగైనా నన్ను క్యాబినెట్‌లోకి తీసుకుంటారనే నమ్ముతున్నాను. అన్నాడు విజయ్.సరే మంచిదంటూ టివి చూడటంలో నిమగ్నమయ్యాడు కుటుంబరావు.
ఇప్పటివరకు వారిద్దరి సంభాషణ వింటూ ఉన్న విరంచి విజయ్‌తో…

మీరు మంత్రివర్గంలో చేరితో మీకు గన్‌మెన్స్, మంత్రుల క్వార్టర్స్‌లో మంచి ఇళ్లు, పిఎ, పిఎస్‌లు ఎంతో హంగామాతో బిజిబిజీగా ఉంటారు కదండి… త్వరగా మీకు మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నా అంది విరంచి.

ప్రజల్లో మంత్రులంటే ఇలాంటి అభిప్రాయం ఉందన్న మాట అంటూ విరంచిని కొంటెగా చేశాడు విజయ్. ఆ చూపునుంచి తప్పించుకుంటూ విరంచి టివి వైపు ముఖం తిప్పింది..విరంచి గారు పిహెచ్‌డి ఎప్పటికి పూర్తి అవుతుంది..తర్వాత ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి అంటూ విజయ్ కావాలని ఆమెను ప్రశ్నించారు…మా గైడ్ తన పిల్లలను చూడాలని, అమెరికా వెళ్లారు. ఆరు నెలలు అక్కడ ఉండవచ్చట. మధ్యలో వస్తారో లేదో కానీ నాకు సమస్య అయింది.

గైడ్స్ అంటే గుర్తుకు వచ్చింది. నేను చదువుకునే సమయంలో మా సీనియర్లు చెప్పేవారు. ఎవరైనా కుర్రాడు పిహెచ్‌డి చేస్తుంటే, తనకు కేటాయించిన గైడ్ ఇంటికి వెలితే ప్రత్యేక సమస్యలు వచ్చేవట, అంటూ నవ్వాపుకోలేక పోయాడు విజయ్…

రెగ్యులర్‌గా సలహాలు,సూచనలు తీసుకునేందుకు ఆ ప్రొఫసర్ ఇంటికి వెళ్లక తప్పదు కదా ఆయనను అల్లునిగా చేసుకునేందుకు ప్రయత్నించే వారట ఆ గైడ్ కుటుంబం. ఇంటికి కూడా రమ్మని టీ, టిఫిన్స్ తన కూతురుతో ఇప్పించేవారట. ఈ సంబంధం విషయంలో విద్యార్థి సుముఖంగా లేడని తెలిస్తే గైడ్‌గా ఉండాల్సిన ఈ ప్రొఫసర్ శత్రువుగా మారేవాడట. ఇక ఆ విద్యార్థి స్వయంగా థీసిస్ (సిద్దాంత గ్రంథం) తయారు చేసుకొని వెళ్లినా ఎన్నో వంకలు పెట్టే వారట. సమస్య తెలిసినా ఏమి చేయలేని పరిస్థితిలో, ఏమి చేయాలో తెలియక విద్యార్థి అవస్థలు చెప్పుకుంటూ మా సీనియర్లు నవ్వుకునే వారు. ప్రొఫసర్ బిడ్డ చేసుకోవచ్చు కదరా అంటే డ్రమ్‌లాగా ఉంటుంది బాబోయి ఎళ్లకాలం ఎలా భరించాలి. పిహెచ్‌డి రాకున్నా పర్వాలేదని మొత్తుకునే వారట. విజయ్ చెప్పుకుంటూ పోతున్నాడు.

ఇంత అన్యాయంగా ప్రొఫసర్లు ఉండరులే అంటూ విరంచి విజయ్ మాటలను మధ్యలో ఆపింది.

నిజమే విరంచి గారు. ఒకరి ఉదాహరణ కూడా చెప్పారు సీనియర్లు. ఆ విద్యార్థి ఇక చేసేది ఏమీ లేక గైడ్‌ను మార్చుకొన్నాడు మరీ. ఈ కుర్రాడు తన డాక్టరేట్‌సే సాధించుకునేందుకు మరో ఏడాదిన్నర సమయం అధికమయింది మరీ,అంటూ విజయ్ వివరిస్తూ…అయినా మీ అమ్మాయిలకు ఇలాంటి సమస్యలుండవు, లే..ప్రొఫసర్లు తమ మగ సంతానానికి కట్నం, హోదాలు చూసుకొని కోడళ్లను తెచ్చుకుంటారు. అంటూ నవ్వాడు విజయ్.

ఇక ఢిన్నర్ చేద్దురు కానీ రండి, అంటూ విరంచి తల్లి పిలవడంతో వారి సంభాషణ ఆగిపోయింది. తన డ్రింక్ గ్లాస్‌లో మరికొంత మిగిలి ఉండటంతో ఆ గ్లాస్‌తోనే కుటుంబరావు డైనింగ్ టేబుల్‌కు వచ్చాడు. అప్పటికే విజయ్ కూడా చేతులుకడుక్కొని కుర్చిలో కూర్చున్నాడు. అమ్మ వడ్డిస్తుంది నీవుకూడా కూర్చో అని విరంచి కోరాడు తండ్రి. వద్దులే డాడీ నేను అమ్మ తర్వాత తింటామని చెప్పడంలో అంతా డైనింగ్ టేబుల్‌పైనే ఉంది కదా నలుగురం కూర్చుందాం అని విజయ్ సూచించడంతో, అదే మంచిదని కుటుంబరావు అన్నారు.

ఇదేమిటి విజయ్ గారు ఎప్పుడు నీట్‌గా సేవ్ చేసుకొని కనిపించేవారు..కానీ గడ్డం పెంచుతున్నారెందుకో అని కుటుంబరావు సరదాగా వ్యాఖ్యానించారు.

ఇప్పుడు యూత్ అంతా ఇలాగే కనిపిస్తున్నారు కదా నేను పెంచుకోవాలని సేవింగ్ పనిని తగ్గించుకుంటున్నాని నవ్వుతూ బదులిచ్చాడు.

మీరు గడ్డంతో కూడా బాగుంటారు. ఫ్యాష‌న్ కదా..మీకు నప్పుతుంది. పెంచుకోండి అంది విరంచి.

నేను బయట తిరుగుతున్నప్పుడు వెంటనే ఎవరూ గుర్తు పట్టకుండా నల్ల కళ్లద్దాలు కూడా వాడాలనుకుంటున్నాను. ఇది కూడా నాకు భద్రత కల్పిస్తుందేమో అని విజయ్ చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ గంభీర వాతావరణం నొలకొంది. మరికొద్దిగా చికెన్ పెట్టుకోండి తక్కువగా తింటున్నారు అంటూ విరంచి తల్లి విజయ్‌కు వడ్డించడంతో తర్వాత అవిఇవి మాట్లాడుకుంటూ భోజనం ముగించారు.

ఎన్నాళ్ల తర్వాత నాకు ఇంటి భోజనం తినే అవకాశం వచ్చింది. చాలా థాక్సండీ అంటూ సెలవు తీసుకొని విజయ్ ముందుకు వెళ్తుండగా జాగ్రత్తగా వెళ్లండి.. మీరు తాగకపోయినా, తాగి వాహనాలు న డిపే వారు ఎక్కువగా ఉంటారంటూ విరంచి చెప్పినా విజయ్‌కు ఆమె మాటల్లో తనకు ఇతరుల నుంచి ప్రమాదం ఉందని ఆందోళన పడుతున్నట్లుగా గ్రహించాడు. వారి నుంచి వీడ్కోలు తీసుకొని ఎంఎల్‌ఎ క్వార్టర్‌కు బయలు దేరాడు విజయ్.

మరో ఆలోచన రానీయకుండా కారు నడుపుతున్న విజయ్ తన వెనుక మరో వాహనం వేగంగా దూసుకు వస్తుండటం గమనించాడు.

ఎందుకైనా మంచిదని కారు పక్కకు తీసుకొని నెమ్మదిగా కారును నడుపుతుండగా ఆ వాహనం నడుపుతున్న డ్రైవర్, విజయ్ కారును చూసుకుంటూ ముందుకు వెళ్లాడు. తాగి నడుపుతున్నాడా, లేక ఎవరైనా మరోసారి దాడికి ప్రయత్నిస్తున్నారా అర్థం కాలేదు విజయ్ కు. డ్రైవింగ్ చేసుకుంటూ ఈ ఆలోచనలతోనే క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. ఆ రాత్రి కూడా అదే ఆలోచనలు ఆయనను నిద్రపోనీయలేదు.

రాష్ట్ర సచివాలయం అది. మంత్రులు, అధికారులు ఫైల్స్ చేతుల్లో పట్టుకొని హడావుడిగా కారు దిగి వస్తున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలేక క్యాబినెట్ మీటింగ్ ఉండటంతో ఈ ప్రాంగణంలో ప్రతి రోజు కంటే కార్లు అధికంగా కనిపిస్తున్నాయి.

భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ర్టంలో దాదాపు 24,500 కోట్ల భారీ నష్టం జరిగిందని రిలీఫ్ కమిషనర్ నందా మంత్రులకు వివరిస్తున్నారు. అప్పటికే మంత్రులందరూ తమతమ సీట్లలో కూర్చున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్)క్యాబినెట్ సెక్రటరీ ెదాలో ముఖ్యమంత్రి కి సమీపంలోనే ఆసీనులయ్యారు. జిఎడి(పొలిటికల్) సెక్రటరి సిఎస్‌కు కు సహాయంగా క్యాబినెట్ తీర్మానాలను నమోదు చేసేందుకు అక్కడ ఉన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శులు మరో అయిదుగురు మాత్రమే ఈ సమావేశంలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. ఇతర శాఖల అధికారులు పక్కనే ఉన్న ఛాంబర్‌లో కూర్చొని తమతమ శాఖా పరంగా ఉన్న ఎజెండాపై వివరణ ఇచ్చేందుకు మాత్రమే మీటింగ్‌లోకి వచ్చి, తమ సబ్జెక్టు పై చర్చ కాగానే వెళ్లిపోతుంటారు. ఇదే సంప్రదాయం దాదాపు ప్రతి రాష్ట్రంలో క్యాబినెట్ మీటింగ్‌లో అనుసరిస్తుంటారు. కేంద్ర మంత్రి వర్గ సమావేశం కొంత వేరుగా జరుగుతుంది. కేంద్ర క్యాబినెట్‌లో 70 మంది వరకు మంత్రులుండగా అందులో కొందరు సహాయ మంత్రులు, స్వతంత్ర హోదాతో మరి కొందరు సహాయ మంత్రులుగా ఉండగా 15 నుంచి 20 మంది వరేక క్యాబినెట్ హోదా మంత్రులంటారు. సహాయ మంత్రులు శాఖలో స్వంతంగా వ్యవహరించరాదు. అయితే క్యాబినెట్ హోదా మంత్రులే కేంద్రంలో మంత్రివర్గస మావేశానికి హాజరవుతారు. కానీ తమతమ శాఖలకు చెందిన సహాయ మంత్రులు వారివారి సబ్జెక్టులు వచ్చినప్పుడు క్యాబినెట్ మీటింగ్‌కు అధికారులతో సహా వచ్చి వెళ్తుంటారు. రాష్ట్రాల్లో మాత్రం క్యాబినెట్, సహాయ మంత్రులందరూ మంత్రివర్గ సమావేశంలో పాలుపంచుకుంటారు. వీరంతా ఎవరి శాఖకు వారే స్వతంత్రంగా వ్యహరిస్తారు.

రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో కేంద్రం నుంచి ఇంకా తగిన సహాయం లభించలేదని, తక్షణ సహాయం లభించినందున ప్రకృతి వైపరీత్యాల నివారణకు ఇప్పటికే రాష్ట్రం వద్ద ఉన్న నిధిని కలుపుకొని ఆయాజిల్లాలో చేపట్టిన పనులను నందా వివరించారు. అయితే ఇంకా చాలాచోట్ల రాకపోకల పునరుద్ధరణ జరగలేదని, ట్రాన్స్‌ఫార్మర్లు కూలిపోయిన, కరెంట్ స్థంబాలు పడిపోయిన చోట విద్యుత్ సరఫరా లేక ప్రజలు చీకట్లో మగ్గుతున్నారని యుద్ధప్రాతిపదికగా అక్కడ చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి సూచించారు. పనులు శరవేగంగా జరుగుతున్నాయని అయితే రోడ్డు సదుపాయాలు పునరుద్దరించని ప్రాంతాల్లో కరెంట్ స్థంబాలు చేరవేయడానికి కొంతసమయం పడుతున్నదని విద్యుత్ శాఖా మంత్రి వివరించారు.

చెరువులుతెగిపోయి కొన్ని చోట్ల పంటలు అధికంగా నష్టపోయారని,ఇసుకమేట వేసిన చోట్ల రైతులు ఆందోళన పడుతున్నారని, రైతులకు వెంటనే తగిన నష్టపరిహారం అందించేందుకు ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని వ్యవసాయ శాఖమంత్రి సూచనతో సిఎం మాట్లాడుతూ మన ప్రభుత్వ లక్ష్యమే రైతు సంక్షేమం, ఎంత ఖర్చు అయినా రైతులను ఆదుకుంటామని, కేంద్రం నుంచి మరింత సహాయం అందిన తర్వాత చర్యలు ముమ్మరం చేస్తామన్నారు. దెబ్బతిన్న పంటలకు ఎకరాకు ఎంత నష్టపరిహారం ఇవ్వాలో, ఇళ్లు కూలిపోయిన చోట బాధితులకు ఎంత ఇవ్వాలి, చనిపోయిన వారి కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియో విషయంలో ఇప్పటికే అమలులో ఉన్న నిబంధనలను అధికారులు ఎక్కడికక్కడ కలెక్టర్లు చర్యలు తీసుకుంటున్నారని అధికమొత్తాలు అందించే విషయంలో ఖజానా చూసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వం ఉదారంగా నిర్ణయాలు తీసుకుంటుందని మీకు తెలిసిందే కదా.అని ముఖ్యమంత్రి వివరించడంతో ఇక మంత్రులెవరూ ఈ విషయంపై మాట్లాడలేదు. విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు అందడం లేదని, హాస్టళ్లకు నిధులివ్వకుంటే వార్డెన్లు పిల్లలకు ఎలా ఆహారం లభిస్తుందని మరో మంత్రి చెప్పడంతో సంక్షేమ శాఖ మంత్రి బదులిస్తూ ఆర్థిక శాఖ నిధులందించిన తక్షణమే ఈ సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. ఎజెండాలోని ఇతర అంశాలన్నీ పూర్తి కావడంతో అధికారులందరూ మీటింగ్ నుండి వెళ్లిపోయారు. తర్వాత మరో గంటపాటు హాలు లోనే మంత్రులు, ముఖ్యమంత్రి ఉన్నారు. ఎజెండాతో సంబంధం లేకుండా రాజకీయాలు కానీ ఇతర అంశాలు చర్చించుకోవడం పరిపాటిగా వస్తున్నది. అయితే ఈ విషయాలను నేరుగా మీడియాకు వెల్లడించరు.

మంత్రివర్గ సమావేశం తర్వాత క్యాబినెట్ నిర్ణయాలను సమాచార శాఖా మంత్రి మీడియాకు వివరించారు. మర్నాడు పత్రికల్లో ఈ విషయాలన్నీ వివరంగా ప్రచురించారు. పత్రికలను తిరగేస్తున్న విజయ్‌కు కుటుంబరావు నుంచి కాల్ వచ్చింది. చెప్పండి సార్ గుడ్ మార్నింగ్ ఏమిటి విశేషాలు ఉదయమే గుర్తు చేసుకున్నారంటూ విజయ్ నవ్వుతూ మాట్లాడారు.

(సశేషం)

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-14)
Leave A Reply

Your email address will not be published.