AP PGCET 2021 నోటిఫికేషన్ విడుదల

అమరావతి (CLiC2NEWS): ఎపిలోని పీజీ కోర్సులలో ప్రవేశ పరీక్షలకి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి పీజీ సెట్ నిర్వహిస్తోంది. ఈ సంవత్సరంల కడప యోగి వేమన వర్సిటీ పీజీ సెట్‌ను నిర్వహణా బాధ్యతలు తీసుకుంది. దీనిలో భాగంగా ఏపీ పీజీ సెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవాళ్లి (బుధవారం) నుంచి ఆన్‌లైన్‌లో ధరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది.
- ఫీజు వివరాలు
ఓసీ విద్యార్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.850,
బీసీలకి రూ.750,
ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌లకు రూ.650గా ఫీజు నిర్ణయించింది. - దరఖాస్తుల స్వీకరణకు గడువు
ఆన్‌లైన్‌లో ధరఖాస్తుల స్వీకరణకి సెప్టెంబర్ 30 చివరి తేదీ
రూ. 200 అదనపు రుసుముతో అక్టోబర్ 4వ తేదీ వరకు
రూ.500 అదనపు రుసుముతో అక్టోబర్ 8 వరకు తుది గడువు - పరీక్ష
అక్టోబర్ 22న పీజీ సెట్ పరీక్ష