దేశంలో కొత్తగా 30,570 కరోనా కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో కొత్తగా 30,570 మంది కరోనా బారినపడ్డారు. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది.

  • తాజా కేసుల‌తో క‌లిపి మొత్తం బాధితుల సంఖ్య 3,33,47,325కు చేరింది.
  • గత 24 గంటల్లో కొత్తగా 38,303 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
  • ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 3,25,60,474 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు.
  • ప్ర‌స్తుతం దేశంలో 3,42,923 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.
  • గత 24 గంటల్లో కొత్తగా 431 మంది మృతిచెందారు.
  • ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 4,43,928 మంది మహమ్మారి వల్ల మరణించారు.
  • దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా కొనసాగుతున్నది.
  • గత 24 గంటల వ్యవధిలో 64,51,423 మంది వ్యాక్సిన్‌ పంపిణీ చేశారు.
  • ఇప్పటివరకు 76,57,17,137 కరోనా టీకా డోసులను పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
1 Comment
  1. SEO says

    Wow, wonderful weblog format! How long have you ever been blogging for? you make running a blog look easy. The full glance of your website is fantastic, as neatly as the content material!!

Leave A Reply

Your email address will not be published.