ఈ నెల 19, 20 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు!

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో వచ్చే 19, 20 తేదీల్లో (సోమ, మంగళవారం) ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 20వ తేదీన కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్‌పల్లి, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో ఒకటి రెండు ప్రదేశాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.