ప్రతిపక్షంపై దాడులు ఎంతో కాలం సాగవు: ఎమ్మెల్యే వేగుళ్ళ

మండపేట (CLiC2NEWS): మాజీ సిఎం చంద్రబాబు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ దాడిచేయడం చాలా నీచాతి నీచమైన చర్య అని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. జోగి తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడటం దుర్మార్గమని మండిపడ్డారు. ఇటువంటి దుర్మార్గపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్యే వేగుళ్ళ ద్వజమెత్తారు. ప్రతిపక్షంపై కక్ష సాధించడం కోసం వైసీపీ నాయకులు దుర్బుద్ధితో చేస్తున్న దాడులు ఎంతో కాలం సాగవని ఆగ్రహాఁ వ్యక్తం చేశారు. ఇటువంటి దుశ్చర్యలు ప్రభుత్వ పతనానికి నాంది అని హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకుల కుట్రపూరిత చర్యలపై తీవ్రంగా స్పందించారు. రోజురోజుకి వైసీపీ నాయకుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ నాయకులు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిందిపోయి దౌర్జన్యంగా దాడులు చేయటం మంచి పద్దతి కాదని మరోసారి హెచ్చరించారు. ఏంచేసిన అడిగేవారు లేరన్న ఉద్దేశ్యంతో వైసీపీ నాయకులు ప్రవర్తన ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఇంటిపైనే దాడికి పాల్పడ్డారంటే సామాన్యుల పరిస్ధితి ఎంటో అర్ధంకాని పరిస్ధితులలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన పిరికిపంద చర్యకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. నానాటికీ పెచ్చుమీరుతున్న వైసీపీ నాయకుల ఆగడాలకు అడ్డుకట్ట వెయ్యాల్సిన పోలీసులే వారికి వత్తాసు పలుకుతూ టీడీపీ నాయకులను అరెస్టులు చెయ్యటం సిగ్గుమాలిన చర్య అని తూర్పార పట్టారు. దీనిపై రాష్ట్ర డీజీపీ బాధ్యత వహించి వెంటనే జోగి రమేష్ పైన అతని అనుచరులపైన కేసులు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వేగుళ్ళ డిమాండ్ చేశారు.

1 Comment
  1. Social Media Marketing says

    Wow, awesome weblog layout! How long have you been running a blog for? you make blogging look easy. The total glance of your website is fantastic, as neatly as the content material!!

Leave A Reply

Your email address will not be published.