పంజాబ్ కొత్త సీఎంగా చరణ్‌జిత్.

చండీగఢ్ (CLiC2NEWS): పంజాబ్ రాజకీయాల్లో కెప్టెన్ అమరీందర్ తర్వాత తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. చరణ్‌జిత్ సింగ్ చన్నీ (47) పేరును కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఖరారు చేసింది. చరణ్ సింగ్ ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ఆ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి హరీశ్ రావత్ ఆదివారం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
ఇంతకుముందు సుఖ్‌జిందర్ సింగ్ రణ్‌దవా కొత్త పంజాబ్ సీఎంగా ఎంపిక చేసినట్లు అఖిల భారత కాంగ్రెస్ (ఏఐసీసీ) ఓ ప్రకటన చేసింది. కానీ తర్వాత మారిన పరిస్థితుల్లో చరణ్‌జిత్ చన్నీని ఎంపిక చేసినట్లు ఆదివారం సాయంత్రం మరో ప్రకటన చేసింది.