భారీగా పెరిగిన బంగారం ధర

హైద‌రాబాద్ (CLiC2NEWS): ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. కరోనా నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతు న్నాయని నిపుణులు అంటున్నారు. అయితే గత వారం రోజుల నుంచి బంగారం ధరల్లో హెచ్చు త‌గ్గులు చోటుచేసుకుంటున్నాయి. అయితే మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాలతో పసిడికి మళ్ళీ రెక్కలు వచ్చాయి.

ఈ విషయంపై మార్కెటింగ్ నిపుణులు స్పందిస్తూ.. అంతర్జాతీయ పరిణామాలు, కరోనా , ఈక్విటీ మార్కెట్ల పతనం వంటి వివిధ అంశాలు బంగారం ధరలు పెరగడానికి కారణమవుతున్నాయని తెలిపారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బంగారం ధర బుధవారం స్పల్పంగా పెరిగాయి.

వెండి ధర లో కూడా పెరుగుద‌ల న‌మోదైంది.

  • హైదరాబాద్​:
    10 గ్రాముల బంగారం ధర రూ.320 పెరిగి రూ.48,200కు చేరింది.
    కిలో వెండి ధర రూ. 1,309 పెరిగి రూ.62,655కు చేరింది.
  • విజయవాడ:
    10 గ్రాముల పసిడి ధర రూ.48,210గా ఉంది.
    కిలో వెండి ధర రూ.62,630
  • విశాఖ‌ప‌ట్ట‌ణం:
    10 గ్రాముల బంగారం ధర రూ.48,208
    కిలో వెండి ధర రూ.62,639
Leave A Reply

Your email address will not be published.