హుజూరాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో హుజూరాబాద్, ఎపిలోని బద్వేలు శాసనసభ స్థానాల ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. అక్టోబరు 30న ఉప ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.
ఈ మేరకు అక్టోబర్ 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా.. అక్టోబర్ 30న పోలింగ్, నవంబర్ 2న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా షెడ్యూల్ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు, మూడు లోక్సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.
హుజురాబాద్, బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..
- అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల.
- నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8.
- అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన.
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13.
- అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల పోలింగ్.
- నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన
-
By-elections to three Parliamentary Constituencies of UT of Dadra & Nagar Haveli and Daman & Diu, Madhya Pradesh and Himachal Pradesh and 30 Assembly constituencies of various States to be held on 30th October: Election Commission
— ANI (@ANI) September 28, 2021