తెలుగు అకాడమీలో రూ.43 కోట్లు నిధులు మాయం!

హైదరాబాద్ (CLiC2NEWS): తెలుగు అకాడమీలో రూ.43 కోట్ల నిధులు గోల్‌మాల్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీలో కార్వన్‌లో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నకిలీ పత్రాలు సృష్టించిన కేటుగాళ్లు 43 కోట్లు కాజేశారు.
తెలుగు అకాడమీ అధికారులు యూనియన్ బ్యాంక్‌లో రూ.43 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. అయితే ఎఫ్‌డీలు అకౌంట్ నుంచి మాయమయ్యాయని అకాడమీ ప్రతినిథులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తులో అకడమీ అధికారులే డబ్బును విత్‌డ్రా చేసుకున్నారని బ్యాంక్ అధికారులు తెలిపారు.
వివారాల్లోకి వెళ్లితే.. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో తెలుగు అకాడమీ దశాబ్దాలుగా కార్యలపాలు నిర్వహిస్తుంది. ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ నిధులను రెండు రాష్ట్రాలు పంచుకోవాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో భవనాలు, నగదు వివరాలు లెక్కిస్తుండగా యూబీఐ బ్యాంక్‌లో ఉన్న రూ.43 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయని, వాటిని విత్‌డ్రా చేయాలని నిర్ణయించారు. దీంతో ఆ డబ్బుకోసం అధికారులు సంబధిత బ్రాంచ్‌కు వెళ్లగా.. వాటిని ఆగస్టులోనే విత్‌డ్రా చేశారని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.