నిర్మల్‌ జిల్లాలో పులి కలకలం

కుభీర్ (CLiC2NEWS): నిర్మ‌ల్ జిల్లాలో చిరుతపులి కలకలం సృష్టిస్తున్నది. జిల్లాలోని కుభీర్‌ మండలంలోని చాత గ్రామ శివారులో పులి సంచరిస్తున్నదన్న వార్త తో స్థానిక ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. 2 రోజుల క్రితం గ్రామంలో ఓ లేగ దూడను పులి చంపేసింది. ఈ విష‌యాన్ని స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అధికారులు రెండు రోజులుగా పులికోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం చాత గ్రామ శివారులో పులి పాద‌ముద్రలను గుర్తించారు. వాటి ఆధారంగా గాలింపు ముమ్మరం చేశారు. గ్రామ పరిసరాల్లో పులి సంచరిస్తున్న క్ర‌మంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.