దీక్షిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన మంత్రి

కురవి (CLiC2NEWS): మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెగిన కరెంట్ వైర్ తగలడంతో విద్యుత్ షాక్‌తో దీక్షిత (16) అనే బాలికి చనిపోయిన విషషయం తెలిసిందే. జిల్లాలోని కురవి మండలం, గుండ్రాతి మడుగు గ్రామానికి చెందిన కుమారి దీక్షిత కుటుంబాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం పరామర్శించారు.
ఈ సందర్భంగా దీక్షిత చిత్రపటానికి పూలు వేసి మంత్రి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ నుంచి 5 లక్షల రూపాయల నష్ట పరిహారం, అమ్మాయి తల్లి అంగన్‌వాడీ టీచర్ కావడంతో ప్రత్యేకంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచి లక్ష రూపాయల సాయాన్ని మంత్రి అందజేశారు.