11న సింగరేణి కార్మికులకు లాభాల బోనస్‌

హైదరాబాద్‌ (CLiC2NEWS):  అక్టోబ‌రు 11వ తేదీన సింగరేణి కార్మికులకు లాభాల బోనస్‌ చెల్లించనున్నట్లు సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు. అలాగే ఈ నెల 8వ తేదీన అడ్వాన్స్‌ చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. నవంబరు 1వ తేదీన‌ దీపావళి బోనస్‌ ఇవ్వనున్నట్లు చెప్పారు.

ఒక్కో కార్మికుడికి సగటున రూ.1.15లక్షల వరకు చెల్లించనున్నట్లు చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్ పేర్కొన్నారు. లాభాల వాటా బోనస్‌ రూ.79.07కోట్లు, దీపావళి బోనస్‌గా చెల్లింపునకు రూ.300కోట్లు సంస్థ చెల్లిస్తుందని సీఎండీ పేర్కొన్నారు.

కాగా మంగ‌ళ‌వారం సింగరేణి పై ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు… స‌మీక్ష‌లో సంస్థ ఆర్జించన లాభాల్లో కార్మికులకు 29శాతం వాటా ఇవ్వాలని నిర్ణయించిన విష‌యం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.