బాబు మోహన్‌పై 125 ఓట్ల‌ తేడాతో శ్రీకాంత్ గెలుపు

హైద‌రాబాద్ (CLiC2NEWS):  మా ఎన్నికల పోటీలో నరాలు తెగే ఉత్కంఠత నెలకొంది. మా అధ్యక్షుడి పీఠం ఎవరిది అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.  కాగా ‘మా’ ఎన్నికల ఫ‌లితాల్లో తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది.

ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి హీరో శ్రీకాంత్… విష్ణు ప్యానల్ నుంచి పోటీలో ఉన్న బాబు మోహన్ పై విజయం సాధించారు. 125 ఓట్ల తేడాతో మా ఎగ్జిటివ్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్ గెలుపొందారు.

ఏడు ఓట్ల తేడాతో జీవితపై రఘుబాబు విజయం

మా జనరల్ సెక్రటరీ గా ఇరు వర్గాల నుంచి జీవిత, రఘుబాబు పోటీపడ్డారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ పై జీవిత పై విష్ణు ప్యానల్ పై రఘుబాబు గెలుపొందారు.

శివ బాలాజీ విజయం
ట్రెజర్‌గా విష్ణు ప్యానల్ నుంచి శివ బాలాజీ విజయం సాధించారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి ట్రెజర్ గా పోటీలో ఉన్న నాగినీడు ఓడిపోయారు. నాగినీడుపై 32 ఓట్ల తేడాతో శివ‌బాలాజి గెలుపొందారు. శివ‌బాలాజీకి 316 ఓట్లు రాగా, నాగినీడుకు 284 ఓట్లు వ‌చ్చాయి.

మంచు విష్ణు ప్యానెల్‌లో 8 మంది విజ‌యం

‘మా’ఎన్నికల కౌంటింగ్ లో విష్ణు ప్యానల్ నుంచి మాణిక్ , హరినాథ్, శ్రీలక్ష్మి, బొప్ప‌న విష్ణు, పసుమూరి శ్రీనివాస్, శ్రీ‌ల‌క్ష్మి, జ‌య‌వాణి, శశాంక్, పూజిత‌ తదితరులు మొత్తం 8మంది కార్య‌వ‌ర్గ స‌భ్యులుగా గెలుపొందారు.

అలాగే ప్రకాష్ ప్యానల్ నుంచి శివారెడ్డి, అనసూయ, సురేష్ కొండేటి, కౌశిక్ గెలుపొందారు.

Leave A Reply

Your email address will not be published.