AP: చిన్నపిల్లల కార్డియాక్ సెంటర్‌ను ప్రారంభించిన సిఎం జగన్
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి

తిరుపతి (CLiC2NEWS) :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోమవారం చిన్న పిల్లల కార్డియాక్ సెంటర్‌ను ప్రారంభించారు. తిరుమల రెండురోజుల పర్యటనలో భాగంగా జగన్ తిరుమల తిరుపతి చేరుకున్న అనంతరం బర్డ్ అసుపత్రిలో శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. గరుడ వాహన సేవలో సిఎం పాల్గొన్నారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సిఎంకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.