రాజీనామాకు కారణం త్వరలో తెలియజేస్తా: ప్రకాశ్‌రాజ్

హైదరాబాద్ (CLiC2NEWS): `మా` సభ్యత్వానికి తాను రాజీనామా చేయడం వెనక లోతైన అర్థం ఉందని. అదేంటో త్వరలోనే తెలియజేస్తానని నటుడు ప్రకాశ్‌రాజ్ తెలిపారు. `మా` ఎన్నికల్లో మంచు విష్ణు గెలుపొందడడంతో ప్రకాశ్‌రాజ్ మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు రీసెంట్గా ప్రకటించిన విషయం తెలిసిందే. రాజీనామా నిర్ణయం బాధతో తీసుకున్నది కాదని తెలిపారు. తెలుగువాడిగా పుట్టకపోవడం తన దురదృష్టమన్నారు. అతిథిగా వచ్చానని, అతిథిగానే ఉంటానని ప్రకటించారు. ప్రాంతీయత ఆధారంగా ఎన్నికలు జరిగాయని అన్నారు.
ఈ మేరకు రీసెంట్గా ప్రకాశ్‌రాజ్ ట్వీట్ చేశారు.
`మాకు (ప్యానెల్) మద్దతుగా నిలిచిన `మా` సభ్యులకు నమస్కారం. నేను `మా` సభ్యత్వానికి రాజీనామా చేయడం వెనక లోతైన అర్థం ఉంది. మిమ్మల్ని మేం నిరశ పరచం. త్వరలోనే అన్నింటినీ పరిష్కరిస్తా` అని ప్రకాశ్‌రాజ్ ట్వీట్ చేశారు.