కొత్తగా 14,313 కరోనా కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 14,313 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది.
గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 26,579 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
గడిచిన 24 గంటల్లో 181 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ సాగుతోంది. ఇప్పటి వరకు దేశంలో 95.89 కోట్ల మంది కరోనా టీకా తీసుకున్నారు. గడిచిన 24 గంటల్లో 65.86 లక్షల మంది కొత్తగా టీకా తీసుకున్నారు.