సాగర్ 10 గేట్లు ఎత్తివేత

నల్లగొండ (CLiC2NEWS): జిల్లా పరిధిలోని నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. దాంతో సాగర్ 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 4 గేట్లు 5 అడుగులు ఎత్తగా, మరో 6 గేట్లను 10 అడుగులు ఎత్తారు.
- సాగర్ ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 1,72,113 క్యూసెక్కులు
- ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 590 అడుగులు
- ప్రస్తుత నీటిమట్టం 589.7 అడుగులు
- గరిష్ట నీటినిల్వ 312.04 టీఎంసీలు
- ప్రస్తుత నీటినిల్వ 311.14 టీఎంసీలు