TS: ఈ ఏడాది 70% సిల‌బ‌స్‌తోనే ఇంట‌ర్ ప‌రీక్ష‌లు

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ఇంట‌ర్ బోర్డ్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం ప‌రీక్షలు ఈ 70 శాతం సిల‌బ‌స్‌తో నిర్వ‌హించ‌నున్న‌ట్టు ఇంట‌ర్ బోర్డ్ కార్య‌ద‌ర్శి జ‌లీల్ తెలిపారు. అలాగే ఇంట‌ర్ ద్వితీయ సంవ‌త్స‌రం చ‌దువుతున్న విద్యార్థుల‌కు.. మొద‌టి సంవ‌త్స‌రం ప‌రీక్ష‌లు అక్టోబ‌ర్ 25వ తేదీ నుంచి జ‌ర‌గ‌నున్నాయి. రెండో సంవ‌త్స‌రంలో కాలేజ్ మారిన విద్యార్థి, మొద‌టి సంవ‌త్స‌రంలో ఫీజు చెల్లించిన కాలేజీ జోన్ ప‌రిధిలోనే ప‌రీక్ష రాయాల‌ని తెలిపారు.

ప్ర‌శ్న‌ల్లో మ‌రిన్నిచాయిస్‌లు పెంచుతామ‌న్నారు. న‌మూనా ప్ర‌శ్న ప‌త్రాలు, ప‌రీక్ష‌ల మెటీరియ‌ల్‌ను tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన‌ట్లు జ‌లీల్ తెలిపారు. విద్యార్థుల కెరీర్‌, ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకొనే ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.