AP: బెజ‌వాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌

విజయవాడ (CLiC2NEWS): ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారిని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా అర్చకులు ముఖ్య‌మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూలానక్షత్రం సందర్భంగా మంగళవారం విజయవాడ కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమలను సిఎం జ‌గ‌న్ సమర్పించారు. అనంతరం అంతరాలయంలో ముఖ్య‌మంత్రి అమ్మ‌వారికి ప్రత్యేక పూజలు నిర్వ‌హించారు. త‌ర్వాత సిఎంకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.

Leave A Reply

Your email address will not be published.