TS: మంత్రి గంగుల కమలాకర్‌కు కరోనా పాజిటివ్‌

కరీంనగర్ (CLiC2NEWS): తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. జ‌లుబు, జ్వరం రావ‌డంతో మంత్రి క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. ఆ ప‌రీక్ష‌ల్లో ఆయ‌న‌కు పాజిటివ్ నిర్ధార‌ణ అయింది.

వైద్యుల స‌ల‌హా మేర‌కు మంత్రి హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ మ‌ధ్య కాలంలో తనను కలిసినవారు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆయ‌న సూచించారు. కాగా మంత్రి గంగుల కరోనా బారినపడటం ఇది రెండోసారి.

Leave A Reply

Your email address will not be published.