చంద్రబాబు వైసీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు: ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
మండపేట (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి రెండు అనుకోని సంఘటనలు జరిగినంత మాత్రాన టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర బందుకు పిలుపు ఇవ్వడం ఎంతవరకు సబబు అని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. బుధవారం తన కార్యాలయంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
వైసీపీ కార్యకర్తలు ఎంతో సహనంతో ఓర్పుతో వ్యవహరిస్తుంటే చంద్రబాబునాయుడు పట్టాభి కలిసి ఒక పథకం ప్రకారం కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసి రాష్ట్రంలో అశాంతి అలజడి సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. ఒక మనిషిలో ఓర్పు సహనం కొంతవరకూ మాత్రమే ఉంటుందని అది శృతిమించితే ఎవరు ఏమీ చేయలేరని ఆయన అన్నారు. ఈ విధంగా వైసీపీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా పట్టాభి వ్యవహరించడం సమంజసం కాదన్నారు. ఏమైనా సంఘటనలు జరిగి ఉంటే దానికి పలవలు చిలవలు అల్లి వాటిని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో ముడి పెట్టడం రాష్ట్ర రాజకీయం లోకి తీసుకు రావడం మంచి పద్ధతి కాదన్నారు. తాము తమ పార్టీ ప్రజా సంక్షేమం కోసం ప్రజల బాగు కోసం పని చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ పదే పదే చెబుతున్నారని అయితే సంక్షేమ పథకాల వల్ల గత రెండున్నరేళ్లుగా ప్రజలలో వచ్చిన మార్పును గమనించిన తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికల్లో ఏదోవిధంగా అశాంతి అలజడిని సృష్టించి రాజకీయ లబ్ది పొందడానికి చంద్రబాబు చేస్తున్న కుయుక్తులు, చీఫ్ ట్రిక్స్ , నీతిమాలిన రాజకీయాలని ఆయన దుయ్యబట్టారు.
ఈ సమావేశంలో రూరల్ అర్బన్ కన్వీనర్లు పిల్లా వీరబాబు, ముమ్మిడివరం బాపిరాజు, మున్సిపల్ కౌన్సిలర్లు పోతంశెట్టి వరప్రసాద్, మందపల్లి రవికుమార్, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ లు మీగడ శ్రీనివాస్, షేక్ అలీఖాన్ బాబా పార్టీ నాయకులు నక్కా సింహాచలం, సిద్దిరెడ్డి రామకృష్ణ, సిరిపురపు శ్రీనివాస్, యరమాటి వెంకన్నబాబు, సాధనాల శివ భగవాన్ తదితరులు పాల్గొన్నారు.