పోలీసు అమరవీరుల సేవలు వెలకట్టలేనివి: ఎస్పీ రంజన్ రతన్ కుమార్
గద్వాలలో సైకిల్ యాత్రను ప్రారంభించిన ఎస్పీ

గద్వాల (CLiC2NEWS): ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు వెలకట్టలేనివని ఎస్పీ రంజన్ రతన్ కుమార్ అన్నారు మంగళవారం పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గద్వాల పట్టణంలోని వైఎస్‌ఆర్ చౌరస్తా నుంచి బీచుపల్లి వరకు సైకిల్ యాత్రను ఎస్పీ రంజన్ రతన్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శాంతియుత సమాజమే లక్ష్యంగా పోలీసులు పని చేస్తున్నారని ఎస్పీ రంజన్ రతన్ కుమార్ అన్నారు. శాంతియుత సమాజమే లక్ష్యంగా పోలీసులు పని చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రంగస్వామి, సీఐ షేక్ మహబూబ్ బాషా, ఎస్సైలు హరి ప్రసాద్ రెడ్డి, రమాదేవి, విజయ్ భాస్కర్ తదితరులు ఉన్నారు.