నవంబరు 29 నుంచి శీతాకాల పార్లమెంటు సమావేశాలు
షెడ్యూల్ ఖరారు

న్యూఢిల్లీ (CLiC2NEWS): పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకు ఈ సమావేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఆర్థిక రంగానికి చెందిన రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ చట్టం-2013 సవరణ బిల్లు, అదేవిధంగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం-1949 సవరణ బిల్లు ఈ సమావేశాల్లో టేబుల్‌పైకి రానున్నాయి. అలాగే బ్యాంకుల ప్రైవేటీకరణ కోసం బ్యాంకింగ్ కంపెనీస్ చట్టం-1970, బ్యాంకింగ్ కంపెనీస్ చట్టం-1980కి కూడా సవరణలు చేయనున్నారు.