726 కి.మీ. నడిచి చిరంజీవిని కలిసిన అభిమాని
చలించిపోయిన చిరు

హైదరాబాద్ (CLiC2NEWS): టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. చిరంజీవి అంటే ప్రాణం ఇచ్చే అభిమానులు ఎందరో ఉన్నారు. అలాంటి అభిమానులలో ఒకడైన డెక్కల గంగాధర్ చిరును కలిసేందుకు పాదయాత్ర ప్రారంభించాడు. తూర్పు గోదావరి జిల్లాకి చెందిన డెక్కల గంగాధర్. చిరంజీవి నటించిన ‘మాస్టర్’ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా చిరంజీవిని కలిసేందుకు అక్టోబరు 3న ఆయన పాదయాత్ర చేపట్టారు. అమలాపురంలో ప్రారంభమైందీ యాత్ర. అలా గంగాధర్ కాలినడకన (సుమారు 726 కి.మీ.) హైదరాబాద్‌లోని ‘చిరంజీవి బ్లడ్ బ్యాంకు’ చేరుకున్నారు.
ఈ వార్త తెలిసి చిరంజీవి చలించి పోయి వెంటనే ఇంటికి పిలిపించుకుని గంగాధర్‌తో సమయం గడిపారు. అనంతరం గంగాధర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అతని కుటుంబ నేపథ్యం, ఇతర విషయాలు అడిగి తెలుసుకున్న చిరంజీవి ఇలాంటి సాహసాలు మళ్లీ చేయవద్దని సున్నితంగా హెచ్చరించారు.
చిరంజీవిగారంటే ఎంతో అభిమానం… అందుకే ఇన్ని వందల కిలోమీటర్లు నడిచివచ్చాను అని గంగాధర్ చెప్పారు. ఆయన నుంచి ఏం ఆశించిరాలేదు. అయితే తమ అభిమాన హీరోను చూస్తే చాలనుకుని వచ్చాని అన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆతిధ్యానికి పులకించిపోయాడు. చిరును కలవడంతో గంగాధర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాను జీవితాంతం రుణపడి ఉంటాను అని గంగాధర్ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాడు.