పివి ఎక్స్‌ప్రెస్ హైవేపై బోల్తా పడిన కారు

హైదరాబాద్ (CLiC2NEWS): పివి ఎక్స్‌ప్రెస్ హైవేపై వేగంగా దూసుకువచ్చిన కారు కారు బోల్తాపడింది. రాజేందర్‌నగర్ వద్ద 120 పిల్లర్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టి కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
ఘటన జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు కారులో ఉన్న వ్యక్తిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. రోడ్డుకు అడ్డంగా కారు పడిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
విషయం తెలసుకున్న పోలీసులు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.