Mandapeta: డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు..

స్వచ్ఛందంగా రిజిస్ట్రేషన్ కు వెళ్తే అభ్యంతరం లేదు: ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు

మండపేట (CLiC2NEWS): వైసీపీ ప్రభుత్వం గతంలో హౌసింగ్ రుణాలు ఇళ్ల పట్టాలు పొందినవారిని రూ. 15,000 , 30000 చెల్లించి రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని అలా జరగని పక్షంలో లబ్ధిదారులు ఎవ్వరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించవని సచివాలయం ఉద్యోగుల ద్వారా ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. దీనిపై సోమవారం మున్సిపల్ కమిషనర్ను కలిసి ఆయన వివరణ కోరారు. మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ కౌన్సిలర్ యరమాటి గంగరాజు టిడిపి టౌన్ ప్రెసిడెంట్ ఉంగరాల రాంబాబు పార్టీ నాయకుడు మెడింటి సూర్య ప్రకాష్ లతో కలిసి ఎమ్మెల్యే కమిషనర్ చాంబర్లో కమిషనర్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హౌసింగ్ రుణాలు తీసుకున్న వారిని ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టా లబ్దిదారులను వారి గృహాలకు సొమ్ములు చెల్లించి రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని అధికారులు ఒత్తిడి తేవడం ఎంతవరకు సమంజసంగా ఉందని ప్రశ్నించారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే తాము వ్యవహరిస్తున్నామని తెలిపారు. అయితే ఇందులో ఎవరిని బలవంతం చేయడం లేదని ఏ ఒక్క లబ్ధిదారుని కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే ప్రభుత్వ పథకాలకు అనర్హులవుతారు అని తాము చెప్పడం లేదని పేర్కొన్నారు. ఆయా లబ్ధిదారులు రిజిస్ట్రేషన్ ల కోసం స్వచ్ఛందంగా రావాలనే నిబంధన ఉన్నదే కానీ ఇందులో ఎలాంటి బలవంతం, ఒత్తిడిలు లేవన్నారు. పట్టాలతో ఇల్లు నిర్మించుకున్న వారు ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన విధానం వల్ల వారికి శాశ్వత భూహక్కు పత్రం అందివ్వాలనే సదుద్దేశంతో ఈ విధానం తీసుకొచ్చింది అన్నారు. ప్రభుత్వ గృహాలకు రిజిస్ట్రేషన్లు చేయించుకుని శాశ్వత భూ హక్కు పత్రం పొందడం ద్వారా అది లబ్ధిదారులకు మేలు చేకూరుతుందన్నారు. రిజిస్ట్రేషన్లు చేయించుకుంటే ప్రభుత్వ గృహాలకు విలువ పెరుగుతుందన్నారు.
దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రిజిస్ట్రేషన్ల విధానం 2011లోనే అమలులోకి వచ్చిందన్నారు. అయితే దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని సమీక్షలు జరిపి గత ప్రభుత్వాలు దీన్ని ఆచరణలో పెట్టలేదన్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన జీవోను బయటకు తీసి ఆచరణలో పెట్టిందన్నారు. 2011 జీవోలో కొన్ని అంశాలు అన్నీ క్లియర్ గా ఉన్నాయని అందులో రూ. 15000 , 30000 చెల్లించి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలి అన్న నిబంధన ఎక్కడ లేదన్నారు. లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వారి వారి ఇష్టపూర్వకంగానే జరపాలి తప్ప ఎక్కడ బలవంతం చేయకూడదని స్పష్టంగా ఉందన్నారు. రిజిస్ట్రేషన్ విషయంలో ఇటీవల కొంత కాలానికి చెందిన మహిళ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తే ఆమెను వైసీపీ కార్యాలయానికి తీసుకువెళ్లి బెదిరించారని అన్నారు. ఈ రిజిస్ట్రేషన్ల విషయంలో నియోజకవర్గంలో కాలనీ ప్రజలు గాని హౌసింగ్ రుణాలు తీసుకున్నవారు గాని భయపడాల్సిన పని లేదన్నారు. దీనిపై గొల్లపుంత కాలనీలో కొందరు మహిళలు సోషల్ మీడియా ద్వారా మాట్లాడితే వైసీపీ నాయకులకు అది రుచించలేదన్నారు. ఆమెను వైసీపీ కార్యాలయానికి పిలిచి అధినాయకుడు బెదిరించడం కూడా జరిగిందన్నారు. ఇలాంటి బెదిరింపులు ఇప్పటికైనా మానుకుంటే మంచిది అన్నారు.

Leave A Reply

Your email address will not be published.