స్థానిక సంస్థల కోటా MLC స్థానాల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూలు విడుదలైంది.
రాష్ట్రంలోని ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్ , నిజామాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కానుంది.
కరీంనగర్ , మహబూబ్నగర్, రంగారెడ్డి ల నుండి రెండేసి చొప్పున ఎమ్మెల్సీ స్థానాలు త్వరలో ఖాళీ కానున్నాయి.
- ఖీళీ అవనున్నటువంటి ఎమ్మెల్సీ స్థానాలకు నవంబర్ 16న నోటిఫికేషన్ విడుదలవనుంది.
- ఈ ఎన్నికల కోసం నామినేషన్లను నవంబర్ 23 వరకూ స్వీకరిస్తారు.
- నవంబర్ 24న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.
- నవంబర్ 26 వరకూ నామినేషనలను ఉపసంహరించుకు అవకాశం
- డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహిస్తారు.
- డిసెంబర్ 14న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం తెలిపింది.