సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు సిద్దిపేట కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు

హైదరాబాద్ (CLiC2NEWS): సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు సిద్దిపేట కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సిద్దిపేట కలెక్టర్‌గా ఎం హనుమంతరావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కాగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌కు కలెక్టరేట్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.