రహదారిపై యుద్ధవిమానాలు..
పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ (CLiC2NEWS): అత్యవసర సమయంలో రహదారులపైనే యుద్ధవిమానాలు దిగేందుకు వీలుగా జాతీయ రహదారులను రూపొందించడంపై కేంద్ర సర్కార్ దృష్టి సారించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా తాజాగా యుపిలోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌హైవే పైనా యుద్ధవిమానాల ల్యాండింగ్‌కు కసరత్తు పూర్తయింది. కాగా పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు. ఈ ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి మోడీ ఇండియన్ ఆర్మీకి చెందిన సి-130 జె సూపర్ హెర్క్యులస్ విమానంలో దిగి చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైమాని విన్యాసాలను తిలకించారు.
ఎక్స్‌ప్రెస్ వే లక్నో నుంచి ఉత్తరప్రదేశ్ రాజధాని ఘాజీపూర్ వరకు 340.8 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఎక్స్‌ప్రెస్‌వేపై 3.2 కిలోమీటర్ల ఎయిర్ స్ట్రిప్ కూడా తయారు చేయబడింది. కాగా యుద్ధ విమానాలను అత్యవసరంగా ల్యాండింగ్ చేసేందుకు వీలుగా ఎక్స్‌ప్రెస్‌వేపై 3.2 కిలోమీటర్ల ఎయిర్‌స్ట్రిప్ నిర్మించబడింది. 341 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వే రాష్ట్ర రాజధాని లక్నోను ఘాజీపూర్‌తో కలుపుతుంది. రూ. 22,500 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించబడింది.